15 April, 2026 | 5:23 AM

ప్రభుత్వ మహిళలకు అండగా నిలుస్తుంది

10-01-2026 05:53 PM

అల్లిపూర్ గ్రామ సర్పంచ్ శారద లక్ష్మారెడ్డి

చిన్న చింతకుంట: అర్హులైన మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళలకు అండ అని ఈ సందర్భంగా సర్పంచ్ శారద లక్ష్మారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని అల్లిపూర్ గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పథకంలో భాగంగా అర్హులైన 60 మంది మహిళలకు ఆధార్ కార్డు ఆధారంగా చీరల పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శారద లక్ష్మారెడ్డి  ప్రారంభించి సర్పంచ్ మాట్లాడుతూ ఒక్క చీరతో పాటు మహిళల ఆత్మగౌరవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలుస్తోందని తెలిపారు.