15 April, 2026 | 6:57 AM

వేములవాడ పట్టణ బిజెపి శాఖ సమావేశం

10-01-2026 05:49 PM

వేములవాడ టౌన్, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణం లో స్థానిక పద్మశాలి సంఘంలో పట్టణ బిజెపి అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోపి మాట్లాడుతూ.. దివ్య క్షేత్రమైన రాజన్న గుడి దర్శనాలు నిలిపివేసి రెండు నెలలు కావస్తున్న ఎలాంటి డెవలప్మెంట్ లేదు. వేములవాడ ఊరిని డెవలప్మెంట్ పేరుతో ఎక్కడికక్కడ కూల్చివేతలు మాత్రమే చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగజేస్తున్న ఎమ్మెల్యే రాజన్న దర్శనం శివరాత్రి లోపు అందించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి వేములవాడ మున్సిపల్ పై కాషాయo జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేశారు. జిల్లా ఇన్చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ... రానున్న మున్సిపల్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త విష్ చేయాలని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోగా పట్టి మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. కనుక ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హితవు పలికారు.

ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ... వేములవాడలో కేవలం బిజెపితో మాత్రమే అభివృద్ధి సాధ్యమని  గుర్తు చేస్తూ ఆకాశగంగా పైపులైను వంటి ఎన్నో పనులు ప్రజలకు చేసింది బిజెపి అని గుర్తు చేస్తూ ఈసారి బిజెపికి అవకాశం ఇస్తే వేములవాడను ఇంకా ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమానికి ముందుగా 1000 సంవత్సరాల క్రితం ఇదే జనవరిలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఆలయం ఎన్నో మార్లు ద్వoశం కు గురి చేయగా పూజలు ప్రారంభించడం జరిగిందని భీమేశ్వరాలయంలో పూజలు చేసి ఓంకార జపం చేయడం జరిగింది.