ఉచిత కుట్టు, బ్యూటీ పార్లర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం గురజాల రైతు వేదికలో మండల సమైక్య ఆధ్వర్యంలో బట్వాన్పల్లి గ్రామపంచాయతీ లంబడితండా తాళ్ల గురజాల గ్రామ మహిళ సభ్యురాళ్లకు అలీఫ్ సంస్థ 15 రోజుల పాటు ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా కేంద్రాన్నీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సభ్యులందరూ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ప్రభుత్వం ప్రతి రంగంలోఅవకాశం కల్పిస్తున్నాదన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి మార్గాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పాఠశాలల్లో, హాస్టల్లోనూ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే దుస్తులను కుట్టిoచే ఉపాధి అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమంలో తప్పకుండా భాగస్వామ్యo కావాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కిషన్, డీపీఎం సారయ్య, ఏపీఎం అలీఫ్ సంస్థ వ్యవస్థాపకులు కాసిం విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ సంగతి రాజేష్, సాగర్ల లక్ష్మణ్, వంగ రామన్న, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ కమ్యూనిటీ ఆక్టివేటర్స్ మండల సమైక్య బాధ్యులు పాల్గొన్నారు.




