calender_icon.png 5 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో మంచినీటి ఎద్దడి

05-12-2025 01:53:14 AM

నెలరోజులు గడిచనా, వీధుల్లో అందుబాటులోకి రాని మిషన్ భగీరథ

తుంగతుర్తి, డిసెంబర్ 4: అధికారం నిర్లక్ష్యం పాలకుల అలసత్వంతో గ్రామాల్లోని  వీధుల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో గడిచిన నెల తరబడి ప్రజలు కష్టాలు చవిచూస్తున్నారు. మండల కేంద్రంలోని పలు వీధుల్లో, పలు గ్రామాల్లో సైతం మంచినీళ్లు అందుబాటులోకి రాకపోవడంతో, బోర్ల వద్దకు వెళ్లి వీధివాసులు నీళ్లు తెచ్చుకుంటున్నారు.

కొంతమంది ఇంటి ప్రక్కన యజమాను బ్రతిమిలాడి రెండు మూడు బిందెలు తెచ్చుకుంటున్నారు. గతంలో గ్రామపంచాయతీ వారు వేసిన బోర్ల నుండి నీటి సరఫరా జరిగేది. నేడు ఒక ప్రక్క మిషన్ భగీరథ నీళ్ళు, మరొక ప్రక్క బోర్లు పనిచేయకపోవడంతో ప్రజల అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిని నిడదీస్తున్నారు.

గ్రామపంచాయతీ అధికారులు మాత్రం నిధుల కొరతతో , ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేసే  అవకాశం లేదని బహిరంగంగా చెబుతున్నారు. ఏది ఏమైనా తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు