05-12-2025 01:53:46 AM
ఘట్‌కేసర్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : హస్తకళ అనేది చేతులతో చేసే కళాఖండమని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ అన్నారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ ఎల్ బి నగర్ జోన్ ఘనపూర్ లోని చైల్ గార్డెన్ సెంటర్ చిన్నారు చేసిన హస్త కళా ప్రదర్శనను మున్సిపల్ మాజీ చైర్మన్ పావని యాదవ్ సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హస్త కళా అనేది చేతులతో చేసే కళాఖండాల ప్రదర్శన అని ఇందులో చేనేత వస్త్రాలు, చెక్క బొమ్మలు, గిరిజన కళలు వంటివి ఉంటాయన్నారు.
ఇలాంటి ప్రదర్శనలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా చాలా పురాతనమైన కళారూపం భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన వస్త్రాలు, బొమ్మలు ఉన్నాయన్నారు. కొండపల్లి బొమ్మలు, దేవుని ప్రతిమలు, గాజులు, లాంటివి తయారు చేసి వారి కళా ఇలా అందుబాటులో తీసుకువచ్చారని, ఉపాధ్యాయులు సైతం చిన్నారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం చిన్నారులకు బిస్కెట్ చాక్లెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, ఎస్‌ఐ హీన, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.