calender_icon.png 5 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవీంద్ర భారతిలో అనాథ విద్యార్థి గృహం

05-12-2025 01:52:40 AM

అధ్యక్షుడు మార్గం రాజేశ్‌కు సన్మానం 

ఎల్బీనగర్, డిసెంబర్ 4 : తెలంగాణ రాష్ట్ర  భాషా  సాంస్కృతిక శాఖ  సౌజన్యంతో  ప్రఖ్యాత  డాక్టర్ కొండూరు  హరినారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి వేడుకలను గురువారం రవీంద్రభారతిలో నిర్వహించారు.  ఈ సందర్భంగా  రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్వాతంత్య్ర  సమర యోధులు, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులను సన్మానించారు.

సన్మానం అందుకున్నవారిలో ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ ఉన్నారు. అనాథ విద్యార్థులకు వసతి, భోజనం, విద్యా సదుపాయాలు కల్పిస్తున్న మార్గం రాజేశ్ ను మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్  కారాగార  శాఖ పూర్వ డైరెక్టర్ జనరల్  గోపినాథ్ రెడ్డి,  సినీ దర్శకుడు  రేలoగి  నర్సింహారావు, కళ  పత్రికా సంపాదకుడు  డాక్టర్ రఫి తదితరులు హాజరయ్యారు.