calender_icon.png 8 January, 2026 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్థానం నుంచి పతనం దాకా!

06-01-2026 12:00:00 AM

బుర్ర మధుసూదన్ రెడ్డి :

* ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద చ మురు నిల్వలకు చిరునామాగా నిలిచిన వెనిజులా నేడు ‘ప్రెట్రోస్టేట్’గా మారడం వారి స్వయం కృతాపరాధమే. లాటిన్ అమెరికా ప్రాంతంలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న వెనిజులా పేలవమైన పాలన, రాజకీయ వినాశనంతో ప్రమాదకర దుస్థితికి చేరింది.

దక్షిణ అమెరికాలో ఉత్తర సముద్ర తీరాన ఉన్న వెనిజులాకు అందాల భామల దేశంగా పేరుంది. దీనికి కారణం ఇప్పటివరకు ఆ దేశం ఏడు మిస్ యూనివర్స్ టైటిల్స్, ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ గెలు చుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తున జలపాతం ఏంజెల్ ఫాల్స్ వెనిజులాలోనే ఉంది. లాస్ రోక్యూస్ దీవులు, ఒరినుకో డెల్టీ వంటి సహజ సౌందర్య ప్రదేశాలు వెనిజులాను మరింత ప్రత్యేక దేశంగా నిలిపా యి. అయితే నేడు ఆ దేశం ఉనికి, స్వేచ్ఛ ప్ర మాదంలో పడింది.

అమెరికా దురాక్రమణ కోరల్లో చిక్కిన వెనిజులా విలవిల్లాడుతుంది. ఏడు యుద్ధాలు తానే ఆపానని సగర్వంగా ప్రకటించుకున్న ట్రంప్ ఒకపక్క నోబెల్ శాంతి బహుమతిని కోరుకుంటూనే తనను బేఖాతరు చేసిన దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే వస్తున్నారు. ఇప్పటి వరకు శాం తి మంత్రం జపించిన ట్రంప్ నేడు ప్రపంచ అశాంతికి ఆజ్యం పోస్తున్నారనిపిస్తున్నది. సహజ వనరులు అధికంగా ఉన్న చిన్న దేశాలను ఆంక్షల కౌగిలిలో బంధించి ఊపిరి తీసి నంత పని చేస్తున్నారు.

వెనిజులా వద్ద ఉన్న పుష్కల చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్ ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించి, ఆ దేశాన్ని దురాక్రమణ చీకట్లలోకి నెట్టేశారు. ఈ దురాక్రమణలో అమెరికా సైన్యం చేసిన దాడిలో వెనిజులా సైనికులు, పౌర సమాజం కూడా చాలా వర కు మరణించారని తెలుస్తోంది. విశ్వశాంతికి ఊపిరి ఊదుతామన్న దేశమే నేడు ఆ శాంతి దీపాన్ని ఆర్పటానికి ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటోంది. మాదకద్రవ్యాల అక్రమ రవా ణా, వలసలు లాంటి కారణాలను చూపుతు న్న అమెరికా తెర వెనుక మాత్రం చమురు దోచుకునే దుర్బుద్దిని బయటపెట్టింది. 

అరుదైన జీవవైవిధ్యం..

కరాకస్ రాజధానిగా స్పానిష్ భాష మా ట్లాడే వెనిజులా 1999 నుంచి ఫెడరల్ అధ్య క్ష తరహా రాజ్యాంగం పునాదిగా నడుస్తున్న ది. 3.2 కోట్ల జనాభా కలిగిన వెనిజులా దేశానికి సరిహద్దుల్లో కొలంబియా, బ్రెజిల్, గ యానా, ట్రినిడాడ్- టొబాగో దేశాలు ఉన్నా యి. జీవవైవిధ్యంలో ఏడో దేశంగా పేరొందిని వెనిజులా అతి పెద్ద చమురు నిల్వలు ఉ న్న దేశంగా పేరు పొందింది. అత్యంత ఎత్తున ఏంజెల్స్ జలపాతం కలిగిన వెనిజులా 1522 లో స్పెయిన్ కాలనీ రాజ్యం గా ఉండేది. 1811 ముందు ఫ్రెంచ్ అమెరికన్ కాలనీగా ఉన్న దేశం ఆ తర్వాత ‘ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా’గా ప్రకటించబడింది.

అయినప్పటికీ ‘ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా”లో శాఖగా ఉండేది. 1830లో స్వ తంత్ర దేశం గా అవతరించి, 20వ శతాబ్దం సగం వరకు (1958) వెనిజులాలో రాజకీ య అల్లర్లు, ని యంతృత్వ ధోరణి లాంటి సమస్యలతో సతమతమయ్యింది. 1958 నుంచి ప్రజాస్వా మ్య ప్రభుత్య పాలన కొనసాగడం, 1990 ల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షో భాలు, 1989లో కరకాజో తిరుగుబాటు, 1992లో రెండు పర్యాయాలు తిరుగుబా ట్లు, 1993లో ప్ర భుత్వ నిధుల దుర్వినియోగం చేశాడనే కారణంగా నాటి అధ్యక్షడు ‘కార్లోస్ అండ్రస్ పెరె జ్’ ప్రభుత్వం పతనమయ్యింది.

అంతర్గత సమస్యలు..

1998లో కొత్త రాజ్యాంగంతో ఎన్నికలు నిర్వహించి ‘బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా’గా అవతరించింది. ‘ఫెడరల్ ప్రెసిడెన్షి యల్ రిపబ్లిక్’గా కొనసాగుతున్న వెనిజులాలో 23 రాష్ట్రాలు ఉన్నాయి. 20వ శతా బ్దాంలో చమురు నిక్షేపాలు కనుగొన్న తర్వా త వెనిజులా సంపన్న దేశంగా  పిలవడం మొదలైంది. చమురు నిల్వలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా దీనికి అదనంగా తోడయ్యింది. 1970ల్లో ఆకస్మికంగా చము రు ధరలు నాలుగు రెట్లు పెరగడంతో వెనిజులా ఆర్థిక పరిస్థితి ఊహకు అందనంతగా పెరిగిపోయింది.

దీనితో ప్రభుత్వంలో అవినీతి, దుర్వినియోగం పెరగడంతో పతనం ప్రారంభమైంది. 1980ల్లో చమురు ధరలు క్షీణించడం, ఆర్థిక సంక్షోభం, ఉత్పత్తి తగ్గడం, ఔషధాల కొరత, మౌలిక వనరుల కొరత, ద్రవ్యోల్బణం చిక్కులు, పేదరికం, కరువుకాటకాలు, ఆర్థిక అసమానతలు, వ్యాధుల వ్యా ప్తి, శిశుమరణాలు, పోషకాహారలోపం, నేరా లు, అతి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లాంటి సమస్యలతో వెనిజులా నేడు అయోమయ దుస్థితికి చేరుకుంది. దీనికి తోడు అమెరికా సహా పశ్చిమదేశాల ఆంక్షల బం ధంతో ఆ దేశం పరిస్థితి మరింత దిగజారినట్లయింది.

వెనిజులా పతనానికి ఆ దేశ అధ్య క్షుడు నికోలస్ మదురో కూడా ఒక కారణమే. 2013లో హ్యూగో చావెజ్ మరణం తో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మదురో అప్పటినుంచి ఇప్పటిదాకా ని యంతృత్వ పాలనను కొనసాగిస్తూ వచ్చా రు. ఆయన పాలనలో వెనిజులా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం, ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పడం, ఆహార-, ఇంధన కొరతలు ప్రజల జీవితాలను ప్రభావితం చేశా యి.

ఇదే సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ ప్రత్యర్థులపై అణచివేత చర్యలు, ఎన్నికల్లో అక్రమాలు వంటి ఆరోపణలు వచ్చాయి. పశ్చిమ దేశాలు మ దురో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించగా, కొన్ని దేశాలు ఆయనను చట్టబద్ధ నాయకుడిగా గుర్తించకపోవడం కూడా జరిగింది.

స్వయం కృతాపరాధం..

ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద చ మురు నిల్వలకు చిరునామాగా నిలిచిన వెనిజులా నేడు ‘ప్రెట్రోస్టేట్’గా మారడం వారి స్వయం కృతాపరాధమే. లాటిన్ అమెరికా ప్రాంతంలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న వెనిజులా పేలవమైన పాలన, రాజకీయ వినాశనంతో ప్రమాదకర దుస్థితికి చేరింది. వెనిజులా ప్రభుత్వం పూర్తిగా చమురు ఎగుమతులపై ఆధారపడడం, కొందరి చేతుల్లోనే పాలన కేంద్రీకృతం కావడం, బలహీన రాజకీయ వ్యవస్థల్లో జవాబుదారీతనం కొరవ డడం, అవినీతి ఆకాశాన్ని ముద్దాడడం లాంటి కారణాలతో ప్రెట్టోస్టేట్ ఊబిలోకి నెట్టబడింది.

పెట్రోస్టేట్ వర్గ దేశాల జాబితాలో వెనిజులాతో పాటు కామెరూన్, ఇండోనేషియా, ఇరాన్, లిబియా, మెక్సికో, నైజీరియా, ఖతార్, రష్యా, సౌథీ అరేబియా, యూఏఈ లాంటి పలు దేశాలు ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వెనిజులా నుంచి దాదాపు 7.9 మిలియన్ల ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. వెనిజులా చము రు నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతో నేడు అమెరికా దురాక్రమణ నాటకానికి తెర తీసింది.

ఇదే దండయాత్రను మెక్సికో, క్యూ బా, కొలంబియా లాంటి దేశాలపై కూడా  జరుపుతామని హెచ్చరికలు చేసింది. ప్రపం చ శాంతికి అశనిపాతంగా మారుతున్న అమెరికన్ ట్రంప్ పెత్తందారీతనాన్ని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకించి అమెరికా ఒంటెద్దు పోకడలకు ముకుతాడు వేసి శాంతి పతాకం ఎగరాలని ఆశిద్దాం.