నల్గొండ దోస్తుల కోసం నార్లాపూర్ దగ్గర పాలమూరు రంగారెడ్డి
పాదయాత్ర చేస్తే అర్యోగానికి మంచిందని చుక్క నీరు ఇవ్వాలె ఆనాటి సి ఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
వనపర్తి, జనవరి 07 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రము లో జరుగుతున్న నీళ్ల దోపిడీ ని చూసి మా రాష్ట్రము మాకు కావాలని తెలంగాణ ఉద్యమం జరిగిందని రాష్ట్రము ఏర్పాటు తరువాత అధికారం లోకి వచ్చిన కేసిఆర్ ప్రభుత్వం నల్గొండ దోస్తుల కోసం జూరాల సోర్స్ వద్ద ఉన్న పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టును నార్లపూర్ దగ్గర పెట్టారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలమూరును అన్యాయం చేసిందే టి ఆర్ ఎస్ పార్టీ అని, తెలంగాణ ఏర్పాటు తరువాత 2015 లో నది జలాల పంపిణి పై మొదటి ఆఫీక్స్ లో ( ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ సి ఎం లు ) 299 టి ఎం సి లు చాలు అని సంతకం పెట్టారని, 2022 లో జరిగిన రెండవ ఆఫీక్స్ లో కూడా అప్పటి సి ఎం కేసిఆర్ అలాగే చెప్పారని కానీ సి ఎం రేవంత్ రెడ్డి 512 టి ఎం సి లు కావాలని అడుగుతున్నారన్నారు. ఉమ్మడి పాలమూరులో 1956 లో ఆర్డీస్ కట్టారని 16 టి ఎం సి లు ( 1లక్ష 60 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సింది కానీ 50 వేల ఎకరాలకు మాత్రమే ) నీళ్లను కేటాయించారు కానీ 8 టి ఎం సి ల నీళ్లు కూడా రాలేదు చివరి ఆయకట్టు కు నీళ్లు రాలేదని నేను గెలిస్తే ఆర్డీస్ దగ్గర కుర్చీ వేసుకుని పని చేస్తా అని చెప్పి గడిచిన 10 ఏండ్లు పని చేయకుండా మాజీ సి ఎం కే సి ఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆయన ప్రశ్నించారు.
అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసినం అప్పటి సి ఎం చంద్రబాబు నాయుడు నవ్వి పాదయాత్ర ఆరోగ్యానికి మంచింది అని చెబుతూ చుక్క నీరు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎస్ ఎల్ బి సి అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి చేయలేక పోతే నల్గొండ లో ఓట్లు అడుగులేమని క్యాబినెట్ లో సి ఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఒకసారి నల్గొండ మాటలు విని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను జూరాల నుండి శ్రీ శైలం కు వెళ్లారని ప్రస్తుతం డిండి కి నీళ్లు కావాలని మళ్ళీ అడుగుతున్నారని వట్టెం, సిరుస వాడ నుండి కాలువ ద్వారా రూ 300 కోట్ల తో డిండి కు నీళ్లు ఇవ్వచ్చు కానీ ఎదుల నుండి డిండి కు 1200 కోట్ల ఖర్చు అవుతుందని ఇందుకు సంబందించిన క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వట్టెం, సిరుస వాడ నుండి కాలువల ద్వారా అయితే ఖర్చు తక్కువ కావడం జరుగుతుందని ఎదుల నుండి అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని ఈ విషయాన్ని సి ఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు




