14 March, 2026 | 8:49 PM

కార్మిక కర్షక పోరుయాత్ర..?

08-01-2026 12:32 PM

కొల్చారం(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం ఆరోపించారు. కొల్చారం మండల కేంద్రంలో గురువారం సిపిఎం ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరుయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసమ్మ పారిశుద్ధ కార్మికులు రైతులు తదితరులు పాల్గొన్నారు .