15 March, 2026 | 1:51 AM

రైతుల వద్దకే విద్యుత్ శాఖ అధికారులు

08-01-2026 11:49 AM

ప్రజా బాటలో ప్రతి రైతుకు ఉన్న విద్యుత్ సమస్య తీరుతుంది

ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ డిప్యూటీ ఇంజనీర్, వై విజయ సారథి

ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): రైతుల వద్దకే ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖ అధికారులు పంపించి ప్రజా బాట కార్యక్రమం పేరిట రైతులకు ఉన్న విద్యుత్ సమస్యలను తక్షణ పరిష్కారం కోసమే నేరుగా విద్యుత్ శాఖ అధికారులు గ్రామాలలో ప్రజా బాట కార్యక్రమం పేరిట రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ విజయ సారథి అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద, సిఎండి కరుణాకర్ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ రవీందర్, డి విజయసారథి, ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు ప్రజా బాట కార్యక్రమంలో ద్వారా రైతుల విద్యుత్ సమస్యల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు విద్యుత్ సమస్యలు బోరు మోటర్ల వద్ద లూస్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బంది ఇతర సమస్యల పట్ల అవగాహన కల్పించారు. విద్యుత్ వాడకం పట్ల రైతులు కూడా శ్రద్ధ వహించాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకరయ్య జిపిఓ రాములు, గ్రామ పెద్దలు, ప్రతాప్ రెడ్డి మాజీ సర్పంచ్, నాగరాజు, పోలీస్ సంతోష్, శివగారి సాయిలు, వెంకటరెడ్డి, పాండరి తదితరులు పాల్గొన్నారు.