14 March, 2026 | 10:28 PM

వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు విజయక్రాంతి

08-01-2026 12:27 PM

విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడం లో విజయక్రాంతి దిన పత్రిక ముందు వరుసలో ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయక్రాంతి దిన పత్రిక వనపర్తి జిల్లా స్టాఫర్ రాము, మహబూబ్ నగర్ యాడ్స్ ఇంచార్జి మల్లేష్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే మేఘా రెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఫోటో గ్రాఫర్ లోకేశ్వరుడు, వనపర్తి క్రైమ్ రిపోర్టర్ గోపాల్ కృష్ణ యాదవ్, పెద్ద మందడి రిపోర్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు