భీరంగూడలో కొత్త షోరూం ప్రారంభం
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): అత్యుత్తమ కలెక్‌న్స్, ప్రత్యేకమైన కలర్స్, అందుబాటు ధరలతో కోట్లాది కస్టమర్ల ఆదరణ పొందిన కిసాన్ ఫ్యాషన్ మాల్.. తన 60 ఏళ్ల ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లోని భీరంగూడలో శుక్రవారం తన నూతన షోరూంను ఘనంగా ప్రారంభించింది. ఈ షోరూంను ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి, కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, డైరెక్టర్స్ ధన్‌పాల్ ఉదయ్ కుమార్, ధన్‌పాల్ ప్రణయ్ కుమార్ కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని సుచిత్ర సర్కిల్‌లోని తొలి షోరూంకు కస్టమర్స్ నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో, రెండో షోరూం భీరంగూడలో ప్రారంభించారు. అలాగే ఈ నెలలోనే ఈసీఐఎల్‌లో మూడో షోరూంను కూడా ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కస్టమర్ల కోసం ఆషాడం డిస్కౌంట్స్‌తో పాటు ప్రత్యేక ఆఫర్స్‌ను ప్రకటించారు.
కేజీ సేల్ కేవలం రూ.999కే 6 చీరలు, బై 1 గెట్ 1, బై 2 ఆఫర్లతోపాటు మరెన్నో ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యున్నత నాణ్యత, విభిన్నమైన కలెక్షన్స్, ట్రెండీ కలర్‌స, సరసమైన ధరలతో ప్రతి కుటుంబానికి నమ్మకమైన ఫ్యాషన్ కేంద్రంగా నిలిచిన కిసాన్ ఫ్యాషన్ మాల్ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు తన సేవలను విస్తరించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.






