31-05-2025 12:41:14 AM
సీఎంకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సవాల్
జగిత్యాల, మే 30 (విజయక్రాంతి): ’ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి.. మీ ఫోటోను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఏం కర్మ.. మా ఇండ్లలోనే పెట్టుకుం టాం’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ముఖ్యమంత్రికి సవా ల్ విసిరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పడం సిగ్గుచేటన్నారు.
గడిచిన 18 నెలల్లో ప్రజలకు బకాయి పడ్డ హామీలు నెరవేర్చిన మరుక్షణమే రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు ఆఫీసుల్లోనే కాదు, మా ఇంట్లో బెడ్ రూములో కూడా పెట్టుకుంటామని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలు, హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ ఏవి కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదన్నారు. పెంచుతామన్న పెన్షన్లు లెక్క ప్రకారం ఒకే దఫాలో లబ్ధిదారులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చడం చేతగాని సీఎం, ఫోటో పెట్టమనడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు.