18 April, 2026 | 10:59 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

నిధులు నీరసంగా.. నిర్వహణ భారంగా!

13-06-2025 12:56 AM
  1. గుదిబండగా జీపీ ట్రాక్టర్ల మెయింటెనెన్స్ 
  2. డీజీల్, నగదు లేక మూలకు పడుతున్న వైనం 
  3. మావల్ల కాదంటున్న పంచాయతీ కార్యదర్శులు
  4. గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

చేగుంట, జూన్ 12 : గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రతే లక్ష్యంగా చెత్త సేకరణ నిమి త్తం గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్లతో పాటు ట్రక్కు, ట్యాంకర్ లను తీసుకున్నారు. వాటితో చెత్త సేకరణతో పాటు మొక్కలకు నీటిని సరఫరా చేశారు. పాలకవర్గాలు ఉన్న సమయంలో ట్రాక్టర్ కిస్తీలతో పాటు నిర్వహణ సక్రమం గా ఉండేది.

ప్రత్యేక పాలన వచ్చిన తర్వాత పంచాయతీలకు నిధులు రాకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ట్రా క్టర్లు మరమ్మతు చేయించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెద్ద పంచాయతీల్లో కొన్ని నెలలుగా చెత్త సేకరణ నత్తనడకన సాగుతుండగా, చిన్న పంచాయతీల్లో పూర్తి గా నిలిచిపోయింది.

కిస్తీలు చెల్లించలేక, మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉండడంతో పల్లెల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళాలను అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. 

మరమ్మతులు చేయించలేక... 

జిల్లాలో 469 పంచాయతీలుండగా అన్ని చోట్ల చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను కొ నుగోలు చేశారు. వాటికి సంబంధించిన కిస్తీ లు ప్రతినెల రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉండగా పంచాయతీల్లో నిధులు లేక ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్నా యి. పంచాయతీల్లో ఉన్న కొద్ది నిధులు పారిశుద్ధ్య పనులకే సరిపోతుండగా మిగతా పనులకు ఆటంకంగా మారింది.

ట్రాక్టర్లు తీసుకుని ఐదేళ్లు దాటడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని బాగు చేయించాలంటే రూ.30 వేల వరకు ఖర్చవుతుండడం తో పంచాయతీలకు భారంగా మారింది. కనీసం డీజీల్కు డబ్బులు లేక కొన్ని పల్లెల్లో వారానికి ఓసారి మా త్రమే చెత్త సేకరణ చేస్తున్నారు. పెద్ద పంచాయతీల్లో డీజిల్, కిస్తీలకు సంబంధించిన నగదు సర్దుబాటు చేస్తున్నా..చిన్న పంచాయతీల్లో మాత్రం ట్రాక్టర్లు తిప్పలేని పరిస్థితి ఉంది. 

చిన్న పంచాయతీల్లో తిప్పలు.. 

జిల్లాలోని చాలా మండలాల్లోని చిన్న పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సుమారు రూ.50 వేల లోపే ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ దీపాలు, బ్లీచింగ్, సభలు నిర్వహించిన సందర్భాల్లో షామియానాలు, భోజనా ల ఖర్చులకు అప్పులు చేస్తున్నారు.నిధులు కొరతతో ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులెందుకని ప్రకృతి వనాలకు నీళ్లు పో యడం కూడా విస్మరిస్తున్నారు. మరో పక్క బ్యాంకులు బకాయిలు చెల్లించనందుకు వడ్డీ వేస్తూనే.. ఇంకో పక్క వాహనం సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు.