13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నిధులు పక్కదారి!

31-03-2026 01:05 AM
  1. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి
  2. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభు త్వం దారి మళ్లిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో సర్పంచ్‌లకి ఇవ్వాల్సిన నిధులని ఇవ్వకుండా.. సర్పంచ్‌లని అనేక ఇబ్బందులకి గురి చేసిందని, ప్రశ్నించి న వారిని కేసులు పెట్టి జైల్‌కి పంపిందని, అనేక మంది సర్పంచ్‌లు ఆత్మహ త్యలు చేసుకున్నారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చి.. రెండున్నరేళ్లు అయినా వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావును తెలంగాణ మాజీ సర్పం చ్‌ల సంఘం నేతలు కలిసి... తమ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త సర్పంచ్‌లు కూడా కొలువు తీరారు..

ఇంకా ఇప్పటివరకు మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లు లు ఇవ్వలేదుదన్నారు. 15వ ఆర్థిక సంఘం కింద రూ. 640 కోట్లను విడుదల అయ్యాయని, అయినా మాజీ సర్పంచ్‌ల బకాయిలు చెల్లించడం లేద న్నారు. నిధులు లేక గ్రామ పరిపాలన కుంటుపడిందని, కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించకుండా మాజీ సర్పంచ్‌ల బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్‌ల సంఘం పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన పేర్కొన్నారు.