calender_icon.png 30 January, 2026 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తినాపురం అభివృద్ధికి నిధులు మంజూరు

30-01-2026 02:07:50 AM

కార్పొరేటర్ సుజాతా నాయక్ 

ఎల్బీనగర్, జనవరి 29 : హస్తినాపురం డివిజన్‌లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 9.5 కోట్లు నిధులు మంజూరైనట్లు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, హస్తినా పురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు గురువారం జిహెచ్‌ఎంసి కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో హస్తినాపురం డివిజన్ కు రూ, 9.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం, బైరామల్ గూడ, హస్తినాపురం డివిజన్లలో వార్డ్ కార్యాలయాల నిర్మాణాలకు 6.5 కోట్లు, వెంకటేశ్వర కాలనీ, అగ్రికల్చర్ కాలనీ, విశ్వేశ్వరయ్య కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూ, 3 కోట్లు మంజూరైనట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాలనీల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని కార్పొరేటర్ సుజాతా నాయక్ అన్నారు.