calender_icon.png 30 January, 2026 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం అభివృద్ధి కి కేంద్రం కృషి

30-01-2026 02:05:34 AM

  1. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, జూవల్ ఓరం 
  2. వనదేవతలకు కిషన్‌రెడ్డి 75కిలోలు, జువాల్ ఓరం 86 కిలోల తులాభారం సమర్పణ

మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని, జాత ర అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తున్నదని కేం ద్ర మంత్రులు జువాల్ ఓరం, కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం కేంద్రమంత్రులు ఇద్దరు వనదేవతలను దర్శించుకున్నారు. వారికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి 75కిలోలు, జువాల్ ఓరం 86 కిలోలు తులాభారం వేసుకొని అమ్మవార్లకు ఎత్తు బంగారం మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి జ్ఞాపికను అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రక రామప్ప ఆలయానికి మొట్టమొదటి యునెస్కో గుర్తిం పు వచ్చేలా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో నూతన కట్టడాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున అభినందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ వస్తే గిరిజన యువత అభివృద్ధికి మరింత దోహ దపడుతుందని కిషన్‌రెడ్డి అన్నారు.