calender_icon.png 30 January, 2026 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్ట్‌ల మృతిl

30-01-2026 02:09:22 AM

దక్షిణ బీజాపూర్‌లోని కవర్‌గట్టలో ఘటన

చర్ల, జనవరి 29 (విజయక్రాంతి): చత్తీస్‌గడ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దక్షిణ బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా కవర్‌గట్టలో మావోయిస్టులు కనిపిం చారు. దీంతో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావో యిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో భద్రతా దళాలు చేపట్టిన గాలింపు చర్యల సమయంలో ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్ అనంతరం ఒక ఏకే-47 రైఫిల్, 01 9ఎంఎం పిస్టల్, మందు గుండు సామగ్రి, పేలుడు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.