8 April, 2026 | 2:19 AM

నాగోబా ఆలయాభివృద్ధికి నిధులు మంజూరు

08-04-2026 12:00 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

ఉట్నూర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క  జాతర తర్వాత రాష్ట్ర స్థాయిలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన నాగోబా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జిల్లా పర్యటనలో నిధులు మంజూరు చేస్తూ ప్రకటించారు. దీంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా మంగళవారం కేస్లాపూర్ గ్రామ గిరిజనులు, మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

అనంతరం ఆలయ పీఠాధిపతి వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2020 ఏప్రిల్ 20న నాగోబాను సందర్శించుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నాగోబా ఆలయ అభివృద్ధి  చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడిగా పాదయాత్ర చేసిన సందర్భంగా నాగోబా ఆల యాన్ని  పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడంతో పాటు నిధులు మంజూరు చేయడం హర్షినియమన్నారు.

ముత్నూర్ నుండి కేస్లాపూర్‌కు రూ. 15 కోట్ల తో రహదారి పనులతో పాటు నాగోబా ఆల యాభివృద్ధికి  రూ.22 కోట్లు మంజూ రు చేయడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో వచ్చే జాతరలో గా పనులు పూర్తి చేయాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మెస్రం నాగనాథ్, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.