2 July, 2026 | 3:06 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి నిధులు కేటాయించాలి

06-03-2026 01:30 AM

స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణ

ముషీరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): రాబోయే తెలంగాణ బడ్జెట్ 2026 విద్యా, మైనారిటీ సంక్షేమానికి అధిక నిధులను కేటాయించి పూర్తి స్థాయిలో వినియోగించాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(ఎస్‌ఐఓ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యా రంగంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి నిర్ణయాత్మక విధానాలను రూపొందించాలని కోరింది.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌ఐఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ గత బడ్జెట్లలో విద్య, మైనారిటీ సంక్షేమానికి నిధులు కేటాయించినప్పటికీ పూర్తి గా ఖర్చు చేయలేదని అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు లభించే 25 సీట్లు కేటాయించాలని కోరారు.

డిఎస్సి-24లో ప్రకటిం చిన1,183 ఉర్దూ పోస్టుల్లో కేవలం 517 మాత్రమే భర్తీ చేస్తున్నారని, మిగిలిన 666 ఖాళీలను కూడా నింపాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ కొరత ఉందని, ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల మేరకు, మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి, యువత సాధికారతకు కేటాయించిన బడ్జెట్ పరిపాలనా పరమైన అడ్డంకులు లేకుండా ఖర్చు చేయాలని కోరారు.