2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

06-03-2026 01:29 AM

ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, మార్చి 5(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని తాజ్ మహల్ హోట ల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లా ల నుంచి సుమారు 50 మంది సభ్యులు పాల్గొన్నారు.

సమాజ సేవలో విశేష కృషి చేసిన మహిళలను ఈ సందర్భంగా ఘనం గా సన్మానించారు. సామాజిక సేవకు గుర్తిం పు సమాజం కోసం అంకితభావంతో పనిచేసిన మహిళలను గౌరవించడం ఈ కార్యక్ర మం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా ము ఖ్య అతిథిగా ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ డి మౌనిక పాల్గొని మాట్లాడారు. సమాజ సేవలో నిరంతరం కొనసాగాలంటే మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరమని అన్నారు.

వేడుకలకే పరిమితం కాకుండా వృద్ధుల సంక్షేమం కోసం ఈ వేదిక ద్వారా అసోసియేషన్ ప్రభుత్వానికి కొన్ని కీలక డిమాండ్లను సమర్పించింది. అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులకు ప్రభుత్వ అతిథి గృహాల్లో తక్షణ వసతి కల్పించాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వృద్ధులను ఆదుకోవడానికి ప్రత్యేకం గా ‘వృద్ధుల సహాయనిధి’ని ఏర్పాటు చే యాలి. స్థానిక పరిపాలనలో ముఖ్యంగా జీపీలు, మున్సిపాలిటీలలో వృద్ధులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా వారి సమస్యలు విధాన నిర్ణయాల్లో ప్రతిబింబిస్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కన్వీనర్ కృతజ్ఞతలు తెలుపుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, వృద్ధుల గౌరవాన్ని కాపాడటం కోసం అసోసియేషన్ ఎల్లప్పుడూ పోరాడుతుందని పునరుద్ఘాటించారు.