25 June, 2026 | 3:23 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

తక్కువ ధరకే ఫర్నిచర్ సామాగ్రి..

05-06-2025 11:00 PM

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో హోల్సేల్ గా ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ షాపు వేమునూరి రాజేంద్రప్రసాద్ హోల్సేల్ రేట్లతో ప్రజల అభిమానం పొంది షాప్ ప్రారంభించారు. ఈ యొక్క షాప్ ఓపెనింగ్ కు జనగామ జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులను అందరిని ఆహ్వానించగా జిల్లా అధ్యక్షులు దీగోజు నరసింహ చారి, జిల్లా అధ్యక్షులు దీగోజు సాంబాచారి ఆధ్వర్యంలో జనగామ జిల్లా కార్పెంటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని వేమునూరు రాజేంద్రప్రసాద్ వ్యాపారం మంచి అభివృద్ధి పదంలో జరగాలని కోరారు.

కార్పెంటర్ అందరూ తమ వంతు సహకారాలు ఉంటాయని తెలియజేశారు. జనగామలో మార్వాడి షాపుల వారి కంటే రేట్లు తగ్గింపు ఇచ్చుకుంటూ నాణ్యమైన వస్తువులను అందజేస్తానని వేమునూరు రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. కావున జనగామ జిల్లాలోని నూతన గృహములు కట్టుకునే యజమానులకు తక్కువ ధరకే ఫర్నిచర్ ముడి సామాగ్రిని అందజేస్తానని ఇందుమూలంగా వారు తెలియజేశారు.