గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ
ముకరంపుర,(విజయక్రాంతి): సోమవారం మధ్యాహ్న సమయంలో చోటుచేసుకున్న సంఘటనలో మున్సిపల్ ఉద్యోగులపై జరిగిన అసాంఘిక చర్యను నిరసిస్తూ, మంగళవారం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దారం శ్రీనివాస్ రెడ్డి, మడిపెల్లి కాళీ చరణ్ మాట్లాడుతూ... మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ళ రమేష్ విధుల్లో ఉన్న మున్సిపల్ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ తన అసభ్య పదజాలంతో అవమానకరంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో, ఉద్యోగుల జేఏసీ తరఫున మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ళ రమేష్ మున్సిపల్ ఉద్యోగులకు బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి గెస్ట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, ఉద్యోగులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.






