11-07-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, జూలై 10: గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై వేణుగోపాల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు. ఒక కుటుంబ కలహాల కేసు విషయంలో ఎస్సై వేణుగోపాల్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించగా.. గురువారం లంచం తీసుకుంటుండగా ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా ఇటీవలే పదోన్నతి పొంది ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ అవినీతికి పాల్పడటం గమనార్హం.