11-07-2025 12:00:00 AM
మునిపల్లి, జూలై 10 : కర్ణాటక రాష్ట్రం బీదర్ లోని ఇరానీ గల్లీలో అక్రమంగా ఎండు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్న వ్యక్తులను మునిపల్లి పోలీసులు గురువారం పట్టుకున్నారు. మునిపల్లి ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతల్మేట్కు చెందిన మహమ్మద్ సమీర్ గుట్టు చప్పుడు కాకుండా ఎండు గంజాయిని బీదర్లో కొనుగోలు చేసి హైదరాబాద్కు సరఫరా చేస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా స్కూటీపై వెళ్తున్నఓ వ్యక్తిని తనిఖీ చేయగా అందులో 6.4 కేజీల ఎండు గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడైన మహమ్మద్ సమీర్ ను విచారించగా బీదర్ లో కొనుగోలు చేసి హైదరాబాదుకు ఎండు గంజాయి ని సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడని తెలిపారు.
పట్టుబడిన ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడైన మహమ్మద్ సమీర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపారు. మునిపల్లి ఎస్త్స్ర రాజేష్ నాయక్, ఏఎస్‌ఐ భక్కన్న , సిబ్బంది హనీఫ్, పాండు, సునీల్ చాకచక్యంగా పట్టుకున్నందుకు కొండాపూర్ సిఐ సుమన్ కుమార్ అభినందించారు.