17-07-2024 12:05:00 AM
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రోటీ కప్‌డా రొమాన్స్’. ఆగస్టు 20న రానున్న ఈ సినిమాకు సంతోష్‌రెడ్డి కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా.. హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్‌ఆర్ ధ్రువన్, వసంత్ జి సంగీతాన్ని సమకూర్చారు. కృష్ణకాంత్, కాసర్ల శ్యామ్, రఘురాం పాటలు రాశారు. ఈ సినిమాలోని గలీజ్ అనే పాట హీరో విష్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైంది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విష్వక్ మాట్లాడుతూ.. “నిర్మాత వేణుగోపాల్‌కు లవ్‌స్టోరీ మీద మంచి జడ్జిమెంట్ ఉంది. ప్రతి సినిమానూ ఎంతో ప్యాషన్‌తో నిర్మిస్తాడు. మూవీ టీమ్‌ను, హీరోలను చూస్తుంటే ‘నగరానికి ఏమైంది’ రోజులు గుర్తుకొస్తున్నాయి”అని చెప్పారు. దర్శకుడు విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా విజయంపై చాలా విశ్వాసంతో ఉన్నాం. ఈ సినిమా లాంగ్ జర్నీ. ఇదొక ఎమోషన్ రైడ్’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జంతోపాటు పలువురు నటీనటులు, చిత్రబృందం పాల్గొన్నారు.