17-07-2024 12:05:00 AM
కన్నడ కథానాయకుడు సుదీప్ నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాక్స్’. వి క్రియేషన్స్ సంస్థతో కలిపి సుదీప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. ఇంటెన్స్‌గా సాగిన ఈ టీజర్‌కి సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బలాన్నిచ్చింది. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుదీప్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మరోమారు వారిని అలరించనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి, సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనపడనున్నారు.