19-05-2024 12:05:00 AM
ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే18 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడ పాఠశాలలో శనివారం ఆమె క్రీడకారులకు యూనిఫాం, షూస్ అందజేసి మాట్లాడారు. క్రీడాకారులు సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతూ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 120 మంది విద్యార్థులను పాఠశాలకు ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ రమాదేవి, ఎసీఎంవో ఉద్ధవ్, ఏటీడీఓలు క్షేత్రయ్య, పురుషోత్తం, ఖమర్ హుస్సేన్, జీసీడీవో శకుంతల పాల్గొన్నారు.