19-05-2024 12:05:00 AM
మంచిర్యాల, మే 18 (విజయక్రాంతి): భూమికి బలం చేకూర్చేందుకు నాటే పచ్చిరొట్ట విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నామని, అవసరమైన రైతులు వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి తీసుకోవచ్చని శనివారం డీఏవో సురేఖ అన్నారు. శనివారం ఆమె భీమారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేసి మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చి రైతులు విత్తనాలు తీసుకెళ్లొచ్చన్నారు. జన్నారం మండలానికి 820 క్వింటాళ్లు, మంచిర్యాలకు 120 క్వింటాళ్లు, లక్షెట్టిపేటకు 925, హాజీపూర్‌కు 295, దండేపల్లికి 1820 క్వింటాళ్లు, చెన్నూర్ డివిజన్‌లోని జైపూర్ మండలానికి 310 క్వింటాళ్లు, చెన్నూర్‌కు 110, భీమారానికి 150, కోటపల్లికి 75, మందమర్రికి 100 క్వింటాళ్లు, బెల్లంపల్లి డివిజన్‌లోని తాండూరుకు 25 క్వింటాళ్లు, కాసిపేటకు 40, బెల్లంపల్లికి 100, భీమిని డివిజన్‌లోని నెన్నెల మండలానికి 50 క్వింటాళ్లు, భీమినికి 40, వేమనపల్లికి 80, కన్నెపల్లికి 40 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సరఫరా చేశామన్నారు. అలాగే మంచిర్యాల డివిజన్‌లోని దండేపల్లి మంలానికి 550 క్వింటాళ్లు, హాజీపూర్‌కు 150, లక్షెట్టిపేటకు 300, జన్నారం మండలానికి 145 క్వింటాళ్ల జనుము విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు.