calender_icon.png 23 February, 2026 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

09-11-2025 07:02:58 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని బారెగూడ వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ సందర్శించారు. ఐకెపి పిపిసిఎస్ మార్కెటింగ్ స్థలాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యాన్ని రైతులు విక్రయించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలోని రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం మోహన్ దాస్, సెంటర్ ఇంచార్జ్ రంగయ్య, సిసి సంతోష్, వివో ఏలు ఉన్నారు.