కిటకిటలాడిన గాంధారి మైసమ్మ ఆలయం
మందమర్రి, ఆగస్టు 9 : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాం ధారి మైసమ్మ ఆలయం ఆది వారం కిటకిటలాడింది. ఆషాఢ మాసం సందర్భంగా మ హా జాతర అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి చుట్టుపక్కల జిల్లాలతో పాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు బోనాలు తీసుకు వచ్చి అమ్మవారికి స మర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆల యం భక్తినామస్మరణలతో మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏసీ పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, కూతురు ప్రభాకర్, గుర్రం శ్రీనివాస్, బీమా మల్లేష్, కౌన్సిలర్లు వేనంక శ్రీనివాస్, పారేపల్లి తిరుపతి, భీమా శరత్, మందమర్రి సీఐ పర్ష రమేష్, ఆర్కేపీ పట్టణ ఎస్త్స్ర జాడీ శ్రీధర్, కన్నపెల్లి ఎస్‌ఐ, బొల్లం విక్రమ్, భద్రత విధుల్లో పాల్గొన్నారు.






