10 August, 2026 | 5:00 AM

ఆదివాసుల అభ్యున్నతికి కృషి

10-08-2026 12:00 AM

నిర్మల్ ఆగస్టు ౯ ( విజయ క్రాంతి)ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని టిఎన్జీవో భవనంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికా రి నిహారికముందుగా ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. సందర్భంగా పలువురు అధికారులు, సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల ప్ర త్యేక సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వం, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అం దరిపై ఉందని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాం తాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం ప్ర త్యేక శ్రద్ధ వహించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఆదివాసీ యువత విద్య, ఉపాధి, విభిన్న రంగాల్లో ముందుకు సాగేందుకు తగిన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిర్మల్ గ్రామీణ మండల తహసిల్దార్ ప్రభాకర్, నాయకులు మంద మల్లేష్, నైతం భీమ్ రావు, తొడసం శంభు, తొడసం గోవర్ధన్, ముసలి చిన్నయ్య, సాకి లక్ష్మణ్, సంచు శ్రీనివాస్, పెంధొర్ మాధవ్ రావు, పి. శంకర్, సంఘపు నరసయ్య, ఈశ్వర్, సురేశ్, వివిధ సంఘాల నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.