17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రజాసేవలో గాంధీభవన్!

04-06-2025 01:09 AM
  1. 10నుంచి కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమం 
  2. ప్రతీరోజు ప్రజలకు అందుబాటులో ఇద్దరు ప్రజాప్రతినిధులు 
  3. ముందుగా కార్పొరేషన్ల చైర్మన్లు, ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 
  4. కార్యాచరణ రూపొందించిన టీపీసీసీ

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలను ప్రభుత్వం చేత పరిష్కరించేందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టిన టీ పీసీసీ..ఇప్పుడు జూన్ 10వ తేదీ నుంచి ప్రజాప్రతినిధులు గాంధీభవన్‌లో ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూ పొందిస్తోంది.

ప్రతీరోజు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు గాంధీభవన్‌లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై విజ్ఞప్తులు తీసుకొని, వాటిని ప్రభుత్వం చేత పరిష్కరించేలా కృషి చేయనున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తొలుత రోజుకు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు గాంధీభవన్‌లో అందుబాటులో ఉండనుండగా, ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతీరోజు ఇద్దరు చొప్పు న గాంధీభవన్‌కు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. 

నేటినుంచి మంత్రులతో ముఖాముఖి.. 

కొన్ని రోజులుగా వాయిదాపడిన మం త్రులతో ముఖాముఖి కార్యక్రమంలో బుధవారం నుంచి గాంధీభవన్‌లో పునఃప్రా రంభం కాబోతున్నది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మం త్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజాపాలనలో భా గంగా ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని గత ఏడాది పీసీసీ అధ్యక్షుడు మహే శ్‌కుమార్‌గౌడ్ ప్రారంభించారు.

వారంలో రెండురోజులు ఒక మంత్రి అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు గాంధీభవన్ సిబ్బంది పంపడం, అవసరమైతే మంత్రినే జిల్లా అధికారులకు ఫోన్‌చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అయితే గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల వాయిదా పడిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పీసీసీ చీఫ్ మహేశ్‌కు మార్‌గౌడ్ చొరవతో తిరిగి పార్టీ ప్రారంభించనున్నది. 

10వ తేదీ నుంచి జూలై 4 వరకు అందుబాటులో ఉండే కార్పొరేషన్ల చైర్మన్లు తేదీ కార్పొరేషన్ల చైర్మన్లు 

10 సయ్యద్ అజ్మతుల్లా, కాసుల బాలరాజు

11    ఒబెదుల్లా కొత్వాల్, ఎం.విజయబాబు

12  టీ బెల్లయ్యనాయక్, ఎంఏ జబ్బార్

13     మానాల మోహన్‌రెడ్డి, దీపక్ జాన్ 

14    జంగా రాఘవరెడ్డి, ముత్తినేని వీరయ్య

16  తహర్‌బిన్ హమ్‌దాన్, జ్ఞానేశ్వర్‌ముదిరాజ్

17  పటేల్ రమేశ్‌రెడ్డి , కోట్నాక తిరుపతి 

18 శివసేనారెడ్డి, నాయుడు సత్యనారాయణ 

19    ప్రీతమ్‌నాగరి,  జెరిపెట్టి జైపాల్ 

20    మెట్టుసాయికుమార్, కాల్వ సుజాత 

21     నిర్మలాజగ్గారెడ్డి, పొడెం వీరయ్య 

23    మల్‌రెడ్డి రామిరెడ్డి, నూతి శ్రీకాంత్‌గౌడ్ 

24    అవినాష్‌రెడ్డి,  ఆలేఖ్య పుంజాల 

25    ఈరావత్రి అనిల్, ఎన్. గిరిధర్‌రెడ్డి

26    బండ్రు శోభారాణి, బీ జనక్‌ప్రసాద్

27    రాయల నాగేశ్వరరావు, ఎండీ రియాజ్ 

28  ఇనగాల వెంకట్‌రెడ్డి, ఎంఏ పహీయ్ 

30    కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జీవీ వెన్నెల జూలై నెలలో..

చల్లా నరసింహారెడ్డి, ఎండీ ఫహీమ్‌ఖురేషి 

2    అయిత ప్రకాశ్‌రెడ్డి, మన్నే సంతోష్

3 కేశ వేణు, గుత్తా అమిత్‌రెడ్డి 

వీవీ రమణారెడ్డి(దిల్‌రాజు), బీఎం వినోద్‌కుమార్