17 April, 2026 | 8:49 PM

మహానగర అభివృద్ధికి ప్రాధాన్యం

04-06-2025 01:10 AM

- జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.10వేల కోట్లతో పనులు

- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభం 

ఎల్బీనగర్, జూన్ 3: మహానగరంలో అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ మాధవనగర్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్‌తో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు.

రూ.1.16 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. రూ.9 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నగరానికి విద్య, ఉద్యోగ, వ్యాపారం ఇతర పనుల నిమిత్తం వలస వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎవరూ ఎన్ని విమర్శలు చేసినా పట్టింపులేకుండా ముందుకు వెళతామని తెలిపారు.

గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో రూ.7 లక్షల కోట్లకు వడ్డీలు కడుతున్నామని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిధులు సమాకూరుస్తామని తద్వారా వాటిని అర్ధవంతమైన ఆర్థిక వనరులుగా మారుస్తామని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నందు నే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ నుంచి వస్తున్నా రని తెలిపారు. రాబోయే కాలంలో భైరామల్ గూడ చెరువు అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం మంచి నీరు, డ్రైనేజి, సీవరేజీ అభివృద్ధి చేయడానికి భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామ న్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు నిర్మిస్తామని చెప్పారు. త్వరలో సీఎం ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమా లు చేపడతామని తెలిపారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. మానవ సంబంధాలు చాలా ముఖ్యమని నాయకుల మధ్య స్నేహ పూర్వక సంబంధం ఉండాలన్నారు. ప్రజల సొమ్ముకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక పార్టీ నాయకులు మరో పార్టీ నాయకులను కలువద్దనే సంస్కృతి తీసుకువచ్చారని విమర్శిం చారు. ఇలాంటివి ప్రజాస్వామ్యనికి మంచిదికాదని, శత్రువులలాగా ఉంకూడదన్నారు. కార్యక్రమంలో మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ బొగ్గారాపు దయానంద్, కార్పొరేటర్లు వంగా మధుసూధన్‌రెడ్డి, బానోత్ సుజాతానాయక్, మార్కెట్ డైరెక్టర్లు బుడ్డా సత్య నారాయణ, అశోక్‌గౌడ్, బుదారపు గోపాల్ ముదిరాజ్, మద్ది కరుణాకర్‌రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పూల నాగరాజు, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసర్లపల్లి శ్రీపాల్‌రెడ్డి, కాలనీ అధ్యక్షుడు హన్మంతరెడ్డి, కార్యదర్శి బెనర్జీ, ఉపాధ్యక్షురాలు అనసూయ తదితరులు పాల్గొన్నారు.