calender_icon.png 6 September, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జనంలో అపశృతి

06-09-2025 11:30:39 AM

సరూర్ నగర్ చెరువులో నిమజ్జనం చేస్తుండగా

క్రేన్ నుంచి జారి పడిన వినాయక విగ్రహం 

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్(Lingojiguda Division) ధర్మపురి కాలనీలోని, ధర్మపురి కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం కోసం శనివారం తెల్లవారుజామున సరూర్ నగర్ చెరువు వద్దకు వచ్చారు. అయితే చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 7 వద్ద గణేష్ నిమజ్జనం జరుగుతున్న సమయంలో క్రేన్ సిబ్బంది నిర్లక్ష్యంతో గణేష్ విగ్రహం పూర్తిగా కింద పడిపోయింది. దీంతో అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వెంటనే స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోన్ డీసీపీ సిహెచ్. ప్రవీణ్, సరూర్ నగర్ సీఐ సైది రెడ్డి, జిహెచ్ఎంసి సర్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ హాజరై అసోసియేషన్ సభ్యులతో చర్చించారు. అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు గణేష్ తోడు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. క్రేన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. భక్తుల విశ్వాసానికి విఘాతం కలిగించే నిర్లక్ష్య ఘటనలు  జరగకూడదన్నారు. ధర్మపురి కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యుల సహనం ప్రశంసనీయమని, అభ్యర్థన మేరకు బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.