06-09-2025 12:00:00 AM
గాంధారి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): గాంధారిలో మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ప్రారంభమైన గణేష్ నిమజ్జ నం శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ మేరకు గాంధారి మండల కేంద్రంలో గురువారం రాత్రి గణేష్ శోభాయాత్రను గాంధారి మాజీ జడ్పిటిసి హరాలే తానాజీ రావు, గాంధారి తాజా మాజీ సర్పం చ్ మమ్మాయి సంజీవులు, స్థానిక ఎస్త్స్ర ఆంజనేయులు కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు.
శుక్ర వారం శోభయాత్ర తో పాటు నిమజ్జనం నిర్వహించనున్నారు.ఈ మేరకు మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా నుండి ప్రారంభమైన శోభాయాత్ర మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భాజా భజంత్రీలు, నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నృత్యంలు చేస్తూ శోభాయాత్రను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
గణేశులను నిమజ్జనం చేసే గాంధారి పెద్దవాగు వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధారి ఎస్త్స్ర ఆంజనేయులు బందోబస్తు నిర్వహించారు.
హిందూ యువ సేన ఆధ్వర్యంలో బడా మట్టి గణేషుడికి ప్రత్యేక పూజలు
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణం వినాయక చవితి ఉత్సవాలతో సందడిగా మారింది. హిందూ యువసేన యూత్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తున భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లాలోనే అత్యంత ఎత్తున మట్టి వినాయకుడిగా గుర్తింపు పొందిన ఈ విగ్రహం, పర్యావరణ సంరక్షణకు చిహ్నంగా నిలుస్తోంది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులుగా, పర్యావరణ హితమైన మట్టితో ఈ విగ్రహాన్ని రూపొం దించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ గణనాథుడు స్థానిక భక్తులను విశేషం గా ఆకర్షిస్తూ, అందరి దృష్టిని ఆకట్టుకుం టున్నాడు. వినాయక చవితి సందర్భంగా, వేద పండితుల సమక్షంలో ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడు తున్నాయి.
శుక్రవారం నాడు హిందూ యు వసేన ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా, వందలాది మంది భక్తులు ఈ సేవలో పా ల్గొని విఘ్నేశ్వరుడి తీర్థప్రసాదాలు స్వీకరిం చారు, అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం, భజన భక్త కళాకారులచే భజనలు నిర్వహించారు, కార్యక్రమంలో హిందూ యువ సేన సభ్యులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
సైకిల్‌పై గణేష్ నిమజ్జనం చేసిన చిన్నారులు
బాన్సువాడ, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి) : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి నగర్ లోని చిన్నారులు వినూత్నంగా గణేష్ నిమజ్జనం నిర్వహించారు. తమ ఇంట్లో ఉన్న టేబుల్, చైర్లు, డబ్బులను ఉపయో గించి, ఎటువంటి ఖర్చు లేకుండా సైకిళ్లపై గణపతిని ఊరేగించి, ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ప్రత్యేకమైన ఈ నిమజ్జన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.