calender_icon.png 6 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు డాన్‌లు కలిసొస్తే..!

06-09-2025 12:29:02 AM

‘డాన్’ ఫ్రాంఛైజీలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డాన్ -3’. ఈ సినిమాపై సినీప్రియుల్లో ఇప్పటికే ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో భాగమవుతున్నారట. బిగ్ బీ 1978లో తొలిసారి ‘డాన్’గా సినీప్రియులను అలరించారు.

ఆ తర్వాత ‘డాన్’ ఫ్రాంచైజీలు చేసిన షారుక్ ఖాన్ కూడా ‘డాన్ 3’లో ప్రత్యేక పాత్రలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. అంటే ఈ ఇద్దరు పాత డాన్లు.. రణ్‌వీర్‌తో కలిసి స్క్రీన్‌షేర్ చేసుకోనున్నారన్న మాట! ఈ ముగ్గురు లెజెండరీ స్టార్స్ ఒకే తెరపై కనిపిస్తే మాత్రం బాలీవుడ్ హిస్టరీలో ఈ సినిమా అతిపెద్ద సంచలనం కావడం ఖాయం అన్న టాక్ వినవస్తోంది. గత డాన్ చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమా మరింత యాక్షన్, స్టైల్, భారీ స్కేల్‌లో రాబోతుందంటున్నారు.

అలాగే విక్రాంత్ మాస్సే విలన్ పాత్ర నుంచి తప్పుకోవడంతో కరణ్ వీర్ మెహ్రాతో ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని వినికిడి. ఈ ప్రాజెక్టుకు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు.  ఈ మూవీ షూటింగ్ 2026 జనవరిలో ప్రారంభం కానుండగా అదే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.