calender_icon.png 6 September, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జనానికి సర్వం సిద్ధం

06-09-2025 01:08:19 AM

-గణేశుని శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

-మంత్రి పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాట్ల పరిశీలన

-30 వేలమంది పోలీసులతో అడుగడుగునా భద్రత

-హుస్సేన్‌సాగర్ వద్ద 40.. నగరం మొత్తం 403 క్రేన్లు

-ఇప్పటికే 2.07 లక్షల విగ్రహాలు గంగమ్మ ఒడికి

-అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడువనున్న మెట్రో రైళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో నేడు జరగనున్న గణేశ్ మహా నిమజ్జ నానికి సర్వం సిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, వేడుకలు అంగరంగ వైభవంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉన్నతాధికారులతో కలిసి హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గణనా థుని వీడ్కోలుకు భాగ్యనగరం ముస్తాబైంది. పది రోజుల పాటు నగరవాసుల పూజలందుకున్న వినాయక విగ్రహాల మహా నిమజ్జ నం శనివారం కన్నుల పండువగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గద ర్శకత్వంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్, హెచ్‌ఎండీఏ సహా అన్ని విభాగాలు పకడ్బందీ ఏర్పా ట్లు చేశాయని రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లోని క్రేన్ 4, 5 పాయింట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని విభాగాలు కృషి చేశాయి. గణేశ్ ఉత్సవ సమితులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మహా నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సజావుగా సాగేందుకు ఒక బాహుబలి క్రేన్‌తో సహా మొత్తం 40 క్రేన్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉత్సవ సమితితో చర్చిస్తున్నామన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ శోభాయాత్రలు సాఫీగా సాగేందుకు ఊరేగింపు మార్గాల్లో రోడ్ల మరమ్మతులు ఇప్పటికే పూర్తి చేశామని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.

భద్రత విషయంలో రాజీ లేద ని, నిమజ్జన కార్యక్రమాలు, శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా 30 వేల మంది పోలీసులు, షీటీమ్‌లతో కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేశామ ని మంత్రి స్పష్టం చేశారు. మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జన పాయింట్ల వద్ద 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 200 మంది ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం. 15 వేల మంది శానిటేషన్ సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్‌లో 2 లక్షల విగ్రహాల నిమజ్జనం

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన పర్వం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. శుక్రవారం నాటికి గ్రేటర్ జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 2 లక్షల 7 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. నేడు జరగబోయే మహా నిమజ్జనానికి ముందు, నగరంలోని వివిధ చెరువులు, కుంటలలో ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అధికారులు అన్ని చర్య లు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ యం త్రాంగం క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోంది. 

జోన్ల వారీగా నిమజ్జనం..

నగరంలోని ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోని అన్ని నిమజ్జన కేంద్రాల్లో భక్తులు గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు.  

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు ..

గ్రేటర్ పరిధిలో నిర్వహించే గణేశ్ నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవసరమైన చర్యలు చేపట్టింది. హుసైన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పా టు విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని సంస్థ డైరెక్టర్లు డా.నర్సింహులు, చక్రపాణి, కృష్ణా రెడ్డి ప్రారంభించారు.

వినాయక ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి

-బడా గణేశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు

ఖైరతాబాద్ మహాగణపతిని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ‘71 ఏండ్ల కింద గణేశ్ ఉత్సవ సమి తి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్ఠించి ఉత్సవాలను ప్రారంభించింది. దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి. ఒక్కసారి నిర్వహణే కష్టమైన ఈ రోజు ల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి వేడుకలను కొనసాగిస్తోంది’ అని చెప్పారు.

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అం దించిందని. ప్రజాప్రతినిధులు, అధికారు ల సహకారంతో ఎక్కడా సమస్యలు లే కుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామ ని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయ వం తంగా ముగించిన గణేశ్ ఉత్సవ సమి తి సభ్యులను అభినందించారు. రాష్ట్ర ప్రభు త్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చా రు. ఈ ఏడాది హైదారాబాద్‌లో 1,40,000 విగ్రహాలను ప్రతిష్టించా రని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖసంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించినట్టు తెలిపారు.