calender_icon.png 16 May, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు ఇంజక్షన్లు ఇస్తున్న ముఠా అరెస్ట్

16-05-2025 12:00:00 AM

-26 బాటిల్లు స్వాధీనం

నిర్మల్ మే 15 (విజయ క్రాంతి) : మత్తు పదార్థాలకు బానిస అయినా యువకులకు గంజాయి గుట్కా బదులుగా ఆపరేషన్లలో వాడే మత్తు ఇంజక్షన్లను ఇస్తున్న నలుగురు సభ్యుల ముఠా ను గురువారం పట్టుకుని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ జానక షర్మిల తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.

నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత ఆరు నెలల నుండి మత్తు పదార్థాల నియంత్రణ కొరకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టి గంజాయి గుట్కా మత్తు పదార్థాలను పెద్ద ఎత్తున సాధనం చేసుకోవడం జరిగింది అన్నారు. గుట్కా మత్తు పదార్థాలు లభించకపోవడంతో దానికి అలవాటు పడిన యువతకు మత్తు ఇచ్చేందుకు హాస్పిటల్లో వాడే మెడ జూలెం ఇంజక్షన్లను ఇస్తూ అక్రమార్గంలో డబ్బులు సంపాదిస్తున్నారన్నారు.

నిర్మల్ పట్టణంలోని వివిధ ఆస్పత్రిలో పని చేస్తున్న షేక్ పర్దీన్, మహమ్మద్ పర్వేజ్, చవాన్ గోవింద్, మహమ్మద్ అబ్దుల్ దానీష్ ఒక ముఠాగా ఏర్పడి నట్టు తెలిపారు. ఆస్పత్రులలో ఆపరేషన్ తర్వాత మిగిలిన మందు దొంగతనం చేసేవారన్నారు. ఈ మత్తుమందును మాదకద్రవ్యా లకు అలవాటు పడిన వారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకునే వారన్నారు.

ఇటీవలే ఒక ఆసుపత్రిలో మూటలోని సభ్యులు మత్తు మందు వాక్సిన్ లను దొంగతనం చేయడంతో క పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం వచ్చిందన్నారు . దీన్ని ఎస్పీ రాకేష్ మీనా  సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యం లో కేసు విచారణ చేయగా ముఠా సభ్యులను గురువారం బైల్ బజార్ సమీపంలో మత్తుమందును విక్రయిస్తుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

వీరి వద్ద నుండి 26 మెడజోలెం మత్తు పదార్థాల బాటిల్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిర్మల్ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్లు వాడుతున్న వారు వారిపై నిఘా ఉంచాలని అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు .

జిల్లాలో ట్రాక్స్ రైత నిర్మల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు తమకు సహ కరిం చాలని ఆమె పిలుపునిచ్చారు. వీరిని పట్టుకోవడంలో కృషిచేసిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అవినాష్ కుమార్. ఉపేందర్ రెడ్డి సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్‌ఐ నరేష్ కుమార్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.