16-05-2025 01:14:51 PM
సరియైన పత్రాలు లేని 165 మోటర్ సైకిల్స్ ,4 ఆటోలు,
గాంజా చాక్లెట్స్, రెండు హుక్కా పార్ట్, ఒక ఎయిర్ గన్ సీజ్: ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మని ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharat Chandra Pawar) స్పష్టం చేశారు. శుక్రవారం నల్గొండలోని వన్ టౌన్ పరిధిలో లోని మాన్యంచెల్కా లో తెల్లవారు జామున డి.ఎస్.పి,8 మంది సీఐలు 24 యస్.ఐలు మొత్తం కలిపి 320 మంది పోలీస్ సిబ్బంది,ఒక ఎక్స్క్లూజివ్ డాగ్,నార్కోటిక్ డాగ్ తో దాదాపు 500 ఇళ్లల్లో సోదాలు చేయగా, సరియైన పత్రాలు లేని 165 వాహనాలు, నాలుగు ఆటోలు, గంజా చాక్లెట్స్, రెండు హుక్కా పార్ట్, ఒక ఎయిర్ గన్ సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఎక్కువగా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 150 అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. నలుగురు రౌడీ షీటర్స్ అదుపులో తీసుకోగా వీరిలో ఒకరీ వద్ద నుండి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 మందిని గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్టు టెస్టులో రిపోర్ట్స్ వచ్చిందని, వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపైన విచారణ జరుపుతున్నామన్నారు. కమ్యూనిటి కాంటాక్టులో భాగంగా పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీల్లో,ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, మహాలక్ష్మయ్య, కరుణాకర్ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.