16-05-2025 01:17:07 PM
పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోట్రు అర్జున్ రావు.
కల్లూరు (విజయ క్రాంతి): పెరిగిన ఎండ తీవ్రతల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు స్థానిక శాసన సభ్యురాలు మట్ట రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ సూచనల మేరకు మండల పరిధిలోని యర్రబోయినపల్లి గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోట్రు అర్జున్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తండ్రి గారైన పోట్రు భద్రయ్య జ్ఞాపకార్ధంగా గురువారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచించడం జరిగింది. అనారోగ్య పరిస్థితుల లక్షణాలు ఏమైనా కనిపిస్తే తక్షణమే డాక్టర్ సలహాల మేరకు వైద్యం చేయించుకోవడం మంచిదని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు.పని వేళల్లో సమయపాలన పాటించాలని ఎండ తీవ్రతలు పెరగక ముందే కనీస వేతనం వచ్చేలా పనిచేసి ఇంటికి చేరుకోవాలని అన్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే ప్రజలకు మంచినీటి అవసరతను తీర్చేందుకు వాటర్ క్యాన్ లు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ దొడ్డపునేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు నల్లగట్ల పుల్లయ్య,గూడ జోజి,సింగిశాల సునీత, గ్రామ సెక్రెటరీ ఎస్ కే సైదులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.