calender_icon.png 16 May, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి భద్రతను పాటించాలి

15-05-2025 11:55:38 PM

జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్ నాయక్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రహదారి భద్రతలు పాటించి ప్రమాదాలు నివారించాలని జిల్లా రవాణా శాఖాధికారి రామచందర్(District Transport Officer Ramachander) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ కార్యాలయంలో ఎంవిఐ లు గాదె మోహన్, రాయమల్లుతో కలిసి పాఠశాల, కళాశాలల బస్ యజమానులకు, డ్రైవర్లు, సహాయకులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్ లు ఫీట్నెస్ లు కలిగివుండలని రాబోవు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వాహనాలు సరైన ధ్రువపత్రాలు, ఫీట్నెస్ చేసుకోవాలని సూచించారు. తదితర విషయలపై అవగహన కలిపించారు.

ప్రభుత్వ జిల్లా పరీక్షల సహయాధికారి మర్యాల ఉదయ్ బాబు మాట్లాడుతూ... బస్ యజమానులు ,డ్రైవర్ భద్రత నియమ, నిబంధనలు పాటించాలని ప్రతి బస్ లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించారాదని తెలిపారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు  దేవాబుషణం మాట్లాడుతూ... డ్రైవర్లు మానసికంగా, శరీరకంగా దృఢత్వం కలిగి ఉండాలని పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయరాదాని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తిరుపతి చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిక్కొండ సంజీవ్ కుమార్, రాష్ట్ర నాయకులు గోపాల్ సుదర్శన్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ చారి, మాలిక్ బిలవేని, నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.