04-02-2026 12:00:00 AM
నిందితుల నుండి రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్లు స్వాధీనం
నల్లగొండ క్రైమ్, ఫిబ్రవరి 3 : వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్లు 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు నిందితుల వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు చండూరు మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ కు చెందిన పగిళ్ల శివ కుమార్ నల్గొండ పట్టణంలో కెపిఎం కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని భవాని కాలనీకి చెందిన అలుగలు వంశీ కృష్ణ కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు మరో ఇద్దరు బాల నేరస్తులతో కలిసి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు
2025,డిసెంబర్ 30న రాత్రి,ఏపీ లోని కడప జిల్లా, కు చెందిన పల్లెం నరసయ్య మోటార్ సైకిల్ పై హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తూ, కేతేపల్లి గ్రామంలోని సాయి కృష్ణ హోటల్ వద్ద రాత్రి 11. గంటల సమయంలో నిద్ర రావడంతో హోటల్ ఆవరణలో బైక్ పార్క్ చేసి నిద్రించగా, మరుసటి రోజు అనగా తేది 31-న తెల్లవారు జాము 5. గంటలకు లేచి చూడగా బైక్ కనిపించకపోవడంతో కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిశారు
దర్యాప్తులో భాగంగా కొర్లపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కేతేపల్లి ఎస్.ఐ, సిబ్బంది తనిఖీ చేస్తుండగా, రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వ్యక్తులు విజయవాడ వైపు వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.
పగిళ్ల శివ కుమార్ గతంలో జీడి మెట్ల పోలీస్ స్టేషన్ నమోదైన ఒక హత్య కేసులో చర్లపల్లి జైలుకు వెళ్లగా, అలుగలు వంశీ కృష్ణతో జైల్లో పరిచయం ఏర్పడిందిఇద్దరు కలిసి, కేతేపల్లి, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్ మరియు హైదరాబాద్లోని పెట్బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 8 మోటార్ సైకిల్ దొంగతనాలు చేయాగ వాటిని స్వాధీనం చేసుకుని రిమండుకి తరలించిన్నట్లు తెలిపారు దొంగతనాల కేసును ఛేదించిన సి.ఐ శాలిగౌరారం కొండల్ రెడ్డి,CCS సి.ఐ జితేందర్ రెడ్డి,ఎస్. ఐ విజయ్ కుమార్,కేతేపల్లి ఎస్.ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ విష్ణు వర్ధనగిరి, వాహీద్, పుష్ప గిరి సిబ్బందిని అదనపు ఎస్.పి ప్రత్యేకంగా అభినందించారు.