calender_icon.png 6 November, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ సన్నిధిలో కర్నూలు ఎంపీ పూజలు

06-11-2025 12:00:00 AM

అలంపూర్, నవంబర్ 5: ప్రముఖ ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లకు అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చనలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎంపీని శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.