calender_icon.png 1 August, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగాధర్‌కు ఘన సన్మానం

31-07-2025 07:22:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలోని వ్యవసాయ శాఖలో గత 32 సంవత్సరాలుగా కార్యాలయ సహాయకుడిగా సమర్థవంతంగా సేవలందించిన గంగాధర్ గురువారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు