31-07-2025 07:19:08 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ధనికుల మాదిరిగానే నిరుపేదలు కూడా సన్న బియ్యం బువ్వ తినాలని లక్ష్యంతో ఇందిరమ్మ కాంగ్రెస్ రాజ్యం రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేసిందని ఇనుగుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూరెల్లి సతీష్ అన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల ధ్రువపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబంలో ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్న ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం చేసి చూపారు అన్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కల్పించి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.