calender_icon.png 1 August, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన హక్కులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

31-07-2025 07:26:52 PM

గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రాజారామ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సమాఖ్య తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం పద్మశాలి భవన్లో గిరిజన సమైక్య నాయకులు గుగులోత్ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రాజారామ్ పాల్గొని మాట్లాడుతూ... సబ్ ప్లాన్ నిధులను దారి మల్లించి గిరిజనులకు రావాల్సిన వాటాను కొల్లగొడుతున్నారని అన్నారు. అదేవిధంగా తండాలను గ్రామపంచాయతీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడం వివక్ష చూపిస్తున్నారు. దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో  పోరాటాలలో ఉదృతం చేస్తామని ఆయన అన్నారు. నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా గుగులోత్ నరేష్ ఉపాధ్యక్షులుగా బి సతీష్ భానోత్ ప్రతాప్ ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ మనోజ్ సహయ కార్యదర్శులుగా గుగులోతు నరేష్ భాస్కర్ కోశాధికారిగా జాటోత్ పవన్ కార్యవర్గ సభ్యులుగా ఇస్లావత్ రాజు  సురేందర్ వెంకన్న శంకర్ లను ఎన్నుకోవడం జరిగింది.