13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కుషాయిగూడలో గ్యాస్ కష్టాలు

27-03-2026 02:37 AM

బుకింగ్ లేక ఇబ్బందులు

కుషాయిగూడ, మార్చి 26: (విజయ క్రాంతి) : కాప్రా సర్కిల్ పరిధిలోని డా ఏఎస్ రావు నగర్ డివిజన్ ప్రాంతంలో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ఇండియన్ గ్యాస్ సరఫరాలో జా ప్యం, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. స్థానిక ఎన్ ఆర్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు గురువారం నిరసన వ్యక్తం చేశారు.

గత వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నా అందడం లేదని వాపోయారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయడానికి ప్రయత్నించినా సర్వర్ పనిచేయకపోవడంతో మరింత ఇ బ్బంది పడుతున్నామని తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరించి, పెండింగ్లో ఉన్న సిలిండర్లను సరఫరా చేయాలని వారు డి మాండ్ చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.