calender_icon.png 14 October, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కాగా సమాచారం సేకరించండి

09-11-2024 04:31:47 PM

పలు కాలనీలో సర్వేనెంబర్ పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): సమగ్ర కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో చేస్తున్న సర్వే సిబ్బంది పనితీరును ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రజల నుంచి వివరాలను సమగ్రంగా సేకరించి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్న చేసిన సర్వే వరకు పక్కాగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సమాచారం అందించాలని వెంటనే అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.