calender_icon.png 19 January, 2026 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుని బర్త్ డే వేడుకలు

18-01-2026 09:23:14 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ కాన్ఫరెన్స్ హాల్లో రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఈ.వి శ్రీనివాస్ రావు బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్, హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెసర్ విజయచందర్ రెడ్డి, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అధ్యక్షురాలు ఓ. లైలా లు పాల్గొని ఇ.వి శ్రీనివాస్ రావు ను శాలువాతో సన్మానించి, పూల బొకే అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం రక్త శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టుదలతో చేసే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే వ్యక్తి అని, జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలతో సేవలందిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిల్లా రమణ రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మానస రాంప్రసాద్, రెడ్ క్రాస్ సభ్యులు సోదా రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎం.డి నేహాల్ మండల సమ్మయ్య, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.